నాలుగేళ్ల విద్యార్థినిని చితకబాదిన కరాటే మాస్టర్

by Dishafeatures2 |
నాలుగేళ్ల విద్యార్థినిని చితకబాదిన కరాటే మాస్టర్
X

దిశ, అల్వాల్: ప్లే స్కూలే పిల్లలకు ఒక బంధీఖానా వంటిది. అలాంటిచోట పిల్లలను ఆట పాటలతో ఆలరించి బుజ్జగించి క్రమ శిక్షణ నేర్పవలిసిన ఉపాద్యాయులు పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరిస్తే వారి భవిష్యత్తు ఏమవుతదని పలువురు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానససరోవర్ రోడ్డులో ఉన్న టైమ్ ప్లేస్కూల్లో రుతిక అనే నాలుగేళ్ల విద్యార్థిని కళ్యాణ్ అనే ఉపాద్యాయుడు కరాటే నేర్పేక్రమంలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన ఉదంతం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్లేస్కూల్ కు వెళ్లిన విద్యార్థి రుతికను సాయంత్రం వేళ కరాటే నేర్పిస్తానని గ్రౌండ్ లోకి తీసుకెళ్లిన ఉపాద్యాయుడు కళ్యాణ్.. ఆ విద్యార్థిపై పైశాచికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కొట్టిన దెబ్బలకు చిన్నారి ఒంటిపై తీవ్రగాయాలు ఏర్పడ్డాయి.ఇంటికి వచ్చిన కూతురును చూసిన తల్లిదండ్రులు కూతురు ఒంటిపై ఉన్నగాయాలను చూసి షాకయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కరాటే మాస్టర్ పై ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్లేస్కూల్ యజమాన్యం మాత్రం తల్లిదండ్రులకు డబ్బులు ఆశచూపి కేసు పెట్టకుండా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ స్కూల్ కు పర్మిషన్ ఉందా లేదా ఉంటే అంత చిన్నపిల్లలకు కరాటే నేర్పడం అవసరమా? నేర్పేక్రమంలో చిన్నారులకు తగులరాని చోట దెబ్బలు తాకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed