నాగోల్ శివారులో వ్యక్తి దారుణ హత్య..

by Bhanu |

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిగూడ శివారులో సోమవారం ఉదయం దారుణ హత్య సంఘటన చోటుచేసుకుంది.

నాగోల్ శివారులో వ్యక్తి దారుణ హత్య..
X

దిశ, వనస్థలిపురం : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిగూడ శివారులో సోమవారం ఉదయం దారుణ హత్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్‌గా గుర్తించారు. అశోక్ యాదవ్ కాచిగూడలో జ్యూస్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.

తిమ్మాయిగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అశోక్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో దుండగులు బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది పాత కక్షా? లేక ఇతర వ్యక్తిగత కారణాలా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ నేపథ్యం, సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story