- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arrested: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి షాక్.. సొదరుడు అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీ కీలక నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో పాటు అనేక నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ (Gangster Anmol Bishnoi)ను అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ చేశారు. అన్మోల్‌తో పాటు మరో 199 మంది బుధవారం ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే ఎన్ఐఏ అధికారులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు వెల్లడించారు.
అయితే, అన్మోల్ బిష్ణోయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇదే కేసులో ముంబయి పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో అతడికి సంబంధం ఉందని విచారణలో వెల్లడైంది.2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దేశవ్యాప్తంగా అన్మోల్ బిష్ణోయ్‌పై 20 కేసులు ఉన్నాయి. నకిలీ రష్యన్ పాస్‌పోర్ట్ ఉపయోగించి అతడు భారత్ నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన నేపథ్యంలో అక్కడ అరెస్ట్ అయ్యాడు. బిష్ణోయ్ గ్యాంగ్ ఓవర్సీస్ ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేస్తూ ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఎక్స్‌టార్షన్, బెదిరింపులు, హత్యలకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. అన్మోల్ బిష్ణోయ్‌పై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది.






