Arrest: నగరంలో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు.. ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-05 04:43:10  IST  )

రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Arrest: నగరంలో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు.. ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ (Drugs Free State)గా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ (Hyderabad)ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్ (Nigerian) దేశస్తులను నార్కోటిక్ బ్యూరో (Narcotic Bureau) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.12 లక్షల విలువైన కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అయితే, విచారణ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో డ్రగ్స్ భారీ ఎత్తున విక్రయించి వచ్చిన డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లుగా వెల్లడైంది. మరికొందరు డబ్బును కూడబెట్టి ఫారెక్స్ (Forex), వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ (Western Union Money Transfer) ద్వారా నైజిరియన్లు తమ దేశానికి పంపుతున్నట్లుగా తేలింది.

Next Story