- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాటరాయుళ్ల అరెస్టు
by Kema Shiva Kumar |
నగరంలోని మూడో టౌన్ పరిధిలోని శ్రద్దానంద్ గంజ్ లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,580 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

X
దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలోని మూడో టౌన్ పరిధిలోని శ్రద్దానంద్ గంజ్ లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,580 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శ్రద్దానంద్ గంజ్ లో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించగా రంగా రవి, రంగా నర్సింహులు, చింతల మహేష్, రంగా వెంకట రాములు, రంగా మల్లేషం ను పట్టుకొని వారి వద్ద నుండి రూ.1,580. పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట ఆడితే.. 8712659839 లేదా డయల్ 100కి సమాచారం అందజేయాలని, వారి వివరాల విషయంలో గోప్యత పాటిస్తామన్నారు.
Next Story






