- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్..
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, మేడ్చల్ టౌన్: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం వాహన తనిఖీలలో చేస్తుండగా ఓ వ్యక్తి అనుమాస్పదంగా తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అతను ఆల్వాల్ కి చెందిన బట్టరాజు రమేష్ తెలిపినట్లు ఏసీపీ చెప్పారు.
రద్దీ ప్రదేశాలలో పార్కింగ్ చేసిన వాహనాలను దొంగలించి మేడ్చల్ కి చెందిన మంజునాధ్ కి అప్పగిస్తే అతను మహబూబ్ నగర్ కి చెందిన కావలి శివ కుమార్ కి అమ్ముతాడని వివరించారు. వారి స్దావరాలపై దాడి చేయగా ఐదు వాహనాలు స్వాదీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. గతంలో వీరిపై జగద్గురి గుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకటి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసు లు నమోదైనట్లు తెలిపారు. బట్టరాజు రమేష్ ,కావలి శివ కుమార్ అరెస్ట్ అయ్యారని మరొక నిందితుడు మంజునాధ్ పరారీ లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ నరసింహారెడ్డి, ఎస్సై నరసింహ తదితులున్నారు






