- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యకు నిప్పంటించిన భర్త అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
మద్యానికి బానిసై పనికి వెళ్లకపోవడంతో నిలదీసిన భార్యకు నిప్పంటించిన భర్తను పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

దిశ, బడంగ్పేట్: మద్యానికి బానిసై పనికి వెళ్లకపోవడంతో నిలదీసిన భార్యకు నిప్పంటించిన భర్తను పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. పహాడీ షరీఫ్ మహమ్మదీయ కాలనీకి చెందిన షేక్ వసీం (32)కి రుబీనా ఖురేషి (29 )తో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. స్థానికంగా పంచర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన షేక్వసీం పంచర్ దుకాణానికి వెళ్లడం మానేశాడు.
ఈ విషయంలో తరచు భార్య భర్తల మధ్య వివాదం తలెత్తింది. ఈ నెల12వ తేదీన భార్య భర్తల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన భర్త రుబీనా ఖురేషి భార్యకు నిప్పుపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందున్న రుబీనా ఖురేషి తన భర్తే తనకు నిప్పుపెట్టాడని ఇచ్చిన స్టేట్ మెంట్ఆధారంగా పహాడీషరీఫ్‌పై పోలీసులు కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న షరీఫ్ బుధవారం రిమాండ్‌కు తరలించారు.






