- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం తాగుతూ పోలీసులతో వాగ్వాదం.. విద్యార్థి నాయకులపై కేసు నమోదు
ఉస్మానియా యూనివర్సిటీ లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన ఓ విద్యార్జి సంఘానికి చెందిన 8 మందిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన ఓ విద్యార్జి సంఘానికి చెందిన 8 మందిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఓయూ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ జగన్ వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో పలు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలో అటువైపు వెళ్లగా అక్కడ ఎనిమిది మంది మద్యం సేవిస్తూ, బిగ్గరగా అరుస్తూ కనిపించారు. వారిని ప్రశ్నించగా, ఇద్దరు పోలీసులను బూతులు తిడుతూ బెదిరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
ఓయూ విశ్వవిద్యాలయం పిక్నిక్ స్పాట్ కాదు: ఓయూ ఏసీపీ జగన్
బయటి వ్యక్తులు క్యాంపస్ లో ప్రవేశించకూడదని ఏసీపీ జగన్ సూచించారు. విశ్వవిద్యాలయాన్ని కేవలం విద్యాసంస్థగా చూడాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బయటి వ్యక్తులు వచ్చి కేక్ లు కట్ చేస్తూ, దందాలు, సెటిల్మెంట్ లు చేస్తూ ఓయూ లో వాతావరణాన్ని పాడుచేస్తున్నారని అన్నారు. ఓయూ అంటే విశ్వవిద్యాలయం కానీ పిక్నిక్ స్పాట్ కాదన్నారు. కొంతమంది నాన్ బోర్డర్లు, మాజీ లీడర్లు క్యాంపస్ లేకపోతే తమకు ఉపాధి లేదన్నట్టుగా ఓయూ ని పట్టుకుని వేలాడుతూ విద్యార్థులను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఓ వర్గానికి చెందిన పంచాయితీని ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో పెట్టి ఘర్షణకు దిగారని అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై కూడా దాడులు చేశారని వివరించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా తమ కార్యకర్తలకు ఓయూను అడ్డగా మార్చుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.






