- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్ల్ ఫ్రెండ్‌తో గోవా వెళుతున్నారా.. అయితే జాగ్రత్త!
గోవా వెళ్లిన ప్రేమ జంటను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 2023లో ఓ మహిళ ప్రియుడితో గోవా వెళ్లగా అక్కడ షెల్టర్ ఏర్పాట్లు చేసిన వ్యక్తి ప్రియుడితో ఆమె గడిపిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: గోవా వెళ్లిన ప్రేమ జంటను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 2023లో ఓ మహిళ ప్రియుడితో గోవా వెళ్లగా అక్కడ షెల్టర్ ఏర్పాట్లు చేసిన వ్యక్తి ప్రియుడితో ఆమె గడిపిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 2023లో ఓ వ్యక్తితో గోవాకు వెళ్లింది. అయితే ఇటీవల వారికి బస కల్పించిన యశ్వంత్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి రూ.30లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అయితే మహిళకు ఇప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి జరగడంతో అలా చేయవద్దని వేడుకుంది. అయినప్పటికీ వినకుండా బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపైకేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






