- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Alert: ఇన్సూరెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా?
కాదేది మోసానికి అనర్హం అన్నట్లు.. సైబర్ నేరాలకు(Cyber Crimes) అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కాదేది మోసానికి అనర్హం అన్నట్లు.. సైబర్ నేరాలకు(Cyber Crimes) అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చిన్నపిల్లలు ఆడుకునే ఆన్‌లైన్ గేమ్స్ నుంచి.. పెద్దలు చేసే షాపింగ్స్ వరకూ ప్రతీ చోట సైబర్ మోసాలు జరుగుతున్నాయి. నిత్యం కొత్త కొత్త పంథాలతో ఎటాక్ చేస్తున్నారు. తాజాగా బీమా కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ, సాంకేతిక సమస్యల సాకుతో గడువు ముగిసిన పాలసీలను పునరుద్ధరించడం, బీమా బదిలీలు మరియు పునరుద్ధరణల సాకుతో డబ్బు చెల్లించేలా మోసగిస్తున్నారు. స్కామర్లు ఫోన్ కాల్స్ మరియు ఇమెయిల్స్ ద్వారా వ్యక్తులను సంప్రదిస్తూ, వారి బీమా పాలసీలు గడువు ముగియబోతున్నాయని లేదా ఇప్పటికే గడువు ముగిసిపోయాయని చెబుతున్నారు. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ పేరిట మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త. అపరిచిత నంబర్ల నుంచి ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ చేసుకోవాలని లింక్ పంపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దు’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏమరుపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే ఇక నిండా మునిగినట్లే! అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఆశలు పెట్టి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు బీమా రంగంపైనా వల విసురుతున్నారు. బీమా బదలాయింపులు, సాంకేతిక సమస్యల సాకుతో, రెన్యువల్స్ పేరుతో సైబర్ దొంగలు మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.






