- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
ఓ యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన అమానవీయ ఘటన ప్రకాశం జిల్లా (Prakasam District)లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన అమానవీయ ఘటన ప్రకాశం జిల్లా (Prakasam District)లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దోర్నాల (Dornala) మండల పరిధిలోని పెద్ద బొమ్మలాపురం (Pedda Bommalapuram)లో నివాసం ఉంటున్న నాగుర్ వలీ (Nagur Vali) అనే యువకుడు మరో యువకుడిపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో బాధిత యువకుడి శరీరం 80 శాతం కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో నిందితుడు నాగూర్ వలీ (Nagur Vali)తో పాటు మరో మహిళకు గాయలయ్యాయి. అయితే, యువకుడిపై దాడికి కారణం స్థల వివాదమేనని ప్రధాన కారణంగా తెలుస్తోంది. బాధిత యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.






