రాష్ట్రంలో మరో భార్యమణి నిర్వాకం.. భర్త నరాల్లోకి ‘హార్పిక్’ ఎక్కించి మర్డర్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మరో భార్యమణి నిర్వాకం.. భర్త నరాల్లోకి ‘హార్పిక్’ ఎక్కించి మర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: పర పురుషుడి వ్యామోహంలో పడి, వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన భార్యలు, అమాయకులైన భర్తల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణం వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో నివసిస్తున్న ప్రశాంత్ (Prashanth), సంధ్య (Sandhya) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా ఇద్దరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. సంధ్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో భర్తను ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య పక్కా స్కెచ్ వేసింది. పథకం ప్రకారం భర్త ప్రశాంత్‌కు అతిగా మద్యం తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ప్రియుడిని ఇంటికి పలిపించి ఇద్దరూ తీవ్రంగా దాడి చేసి భవనం మీద నుంచి మొదట కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ప్రాణాలు మాత్రం పోలేదు.

నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఇంజెక్ట్..

అయితే, దాడి చేసిన భవనం పైనుంచి తోసేసినా.. ప్రశాంత్ ఇంకా బతికే ఉన్నాడని, శ్వాస తీసుకుంటున్నాడని సంధ్య గమనించింది. ఎలాగైనా అతడని అంతమొందించాలనే కసితో ఇంట్లో బాత్‌రూమ్‌లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్ (Harpic) లిక్విడ్‌ను ఓ సిరంజిలోకి తీసుకుని ప్రశాంత్ నరాల్లోకి (Veins) నేరుగా ఎక్కించింది. శరీరంలోకి విషపూరితమైన క్లీనర్ చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే అత్యంత దారుణమైన స్థితిలో ప్రాణాలు విడిచాడు. అయితే, భార్య సంధ్యపై అనుమానం వచ్చిన ప్రశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందజేయగా.. వారు స్పాటు చేరుకుని భార్య సంధ్య, ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, వివాహేతర బంధం కోసం అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తనే దారుణంగా హతమార్చిన విషయం విని జిల్లా ప్రజలు.. ఇదేం పని అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Next Story