రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. కూతురుతో సహా హైకోర్టు మహిళా లాయర్‌ ఆత్మహత్యాయత్నం

by Kema Shiva Kumar |

హైకోర్టు (High Court) మహిళా న్యాయవాది తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హృదయ విదారక ఘటన జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ (Ranchi)లోని అశోక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. కూతురుతో సహా హైకోర్టు మహిళా లాయర్‌ ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు (High Court) మహిళా న్యాయవాది తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హృదయ విదారక ఘటన జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ (Ranchi)లోని అశోక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్నేహా అఖౌరి (50) కుమారుడు, యువ చార్టర్డ్ అకౌంటెంట్ మిహిర్ (Mihir), ఇటీవలే కోల్‌కతా నుంచి రాంచీకి తిరిగి వచ్చారు. ఆయన ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. కుమారుడి మరణంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిన స్నేహా అఖౌరి, ఆమె 14 ఏళ్ల కుమార్తెతో కలిసి విషం తాగారు. వారిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం గురునానక్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

గత కొంతకాలంగా స్నేహా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ (Suicide Note) లభించలేదు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యాయత్నానికి కారణమా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో అర్గోరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం (Forensic ఒeam) ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్నేహా అఖౌరి కోలుకుంటేనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Next Story