దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. ఒకరు అరెస్ట్‌, 4 హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం

by Kema Shiva Kumar |

పంజాబ్‌లో పాక్ ఐఎస్‌ఐ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అమృత్‌సర్‌లో 4 హ్యాండ్ గ్రనేడ్లతో గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న ఓ నిందితుడిని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ అరెస్ట్ చేసింది.

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. ఒకరు అరెస్ట్‌, 4 హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దాయాది పాకిస్థాన్ (Pakistan) పన్నిన భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. అమృత్‌సర్ (Amritsar), మొహాలీ (Mohali) ప్రాంతాల్లో స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) నిర్వహించిన మెరుపు దాడుల్లో ఒక అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అయితే, పంజాబ్ సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడి నుంచి 4 అత్యాధునిక హ్యాండ్ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసేందుకు వీటిని సిద్ధం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI)‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఈ ఆయుధాలు సరఫరా అయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానిత ఉగ్రవాది అరెస్టు నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుడి నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు.. వారు ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు అన్న కోణంలో విచారిస్తున్నారు.

Next Story