- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు ప్రమాదం మరువకముందే మరో షాకింగ్ ఘటన.. కాలిబూడిదైన కారు
by Gantepaka Srikanth |
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అయితే.. ఈ ఘటన మరువకముందే మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను ప్రమాదం తప్పింది. ముత్తంగి నుంచి కొల్లూరు వైపు వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అందులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొగలు రావడాన్ని గుర్తించి వారంతా కారు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో
Next Story






