భర్త అంత్యక్రియల్లో భార్యకు మరో షాక్

by Chintha Aamani |

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

భర్త అంత్యక్రియల్లో భార్యకు మరో షాక్
X

దిశ,ప్రతినిధి నిర్మల్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త చనిపోవడంతో అంత్యక్రియలకు భార్య తన పిల్లలతో స్వగ్రామం వెళ్లింది. అదే అదునుగా చూసిన దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ. 2 లక్షల సొత్తు దోచుకున్నారు. ఆరోగ్య శాఖ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న దేవిదాస్ మంగళవారం ఇచ్చోడ లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం వారి స్వగ్రామం సోనాల మండలం ఘనపూర్ కు తీసుకువెళ్లారు. కాగా ఇచ్చోడ లో ఉన్న ఇల్లుకు తాళం వేసి ఉండటంతో దొంగలు ఆ ఇంటికి కన్నం వేశారు. బుధవారం రాత్రి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు, బట్టలు దోచుకు వెళ్లారు. అసలే బాధలో ఉన్న మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు దొంగలు చేసిన నిర్వాకం మరింత బాధను నింపింది.

Next Story