రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-20 04:01:33  IST  )

రైలు నుంచి జారిపడి నవ దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైల్వే మార్గంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రైలు నుంచి జారిపడి నవ దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైల్వే మార్గంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి నవదంపతులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం (25), అదే జిల్లా అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)గా రైల్వే పోలీసులు గుర్తించారు.

అయితే ఇద్దరూ గత రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో వారిద్దరూ ప్రమాదవశాత్తూ కింద పడిపోగా.. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు.

Next Story