- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధి ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధి ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫరూక్‌నగర్ బస్ డిపో పక్కనున్న పరుపుల దుకాణంలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణం అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. అంతేకాదు.. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు కూడా వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన స్పాట్‌కు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
వరుస అగ్ని ప్రమాదాలు..
ఇదిలా ఉండగా.. గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు అనే తేడా లేకుండా ఎక్కడో ఒకచోట మంటలు చెలరేగుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం మార్చి నెలలోనే ప్రధాన ప్రాంతాల్లో భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ముదురుతున్న ఎండలు..
ఎండలు ముదురుతున్న కొద్దీ నగరంలో అగ్ని ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా పాత బస్తీ, అమీర్‌పేట్, నాంపల్లి వంటి కిక్కిరిసిన ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం పెను ప్రమాదాలకు దారితీస్తోంది. ఫర్నీచర్ దుకాణాలు, గోదాములు, పాత భవనాల్లో వైరింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్‌లు జరిగి మంటలు వ్యాపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మర్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.






