- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. రూ.14 కోట్లు ముట్టినాక బోర్డు తిప్పేసిన కంపెనీ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి ఓ కంపెనీ రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి ఓ కంపెనీ రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన నగరంలోని కూకట్‌పల్లి(Kukatpally)లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వెల్విజన్ ఇన్ఫ్రా కంపెనీ(Well Vision Company).. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్గా ఇస్తామని కస్టమర్లను ఆకర్షించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు వాషింగ్ మిషన్, రూ.3 లక్షలకు ఫ్రిడ్జ్ బోనస్గా ఇస్తామని చెప్పి నమ్మబలికింది. ఇలా కస్టమర్ల నుంచి ఏకంగా రూ.14 కోట్లు ముట్టిన తర్వాత బోర్డు తిప్పేసింది.
మోసపోయామని(Huge Fraud) గ్రహించిన బాధితులు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెల్విజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. 3 స్కీమ్లతో భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకుని.. మొదటి స్కీంలో లక్షకు రెండు లక్షలు ఇస్తామంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారని పోలీసుల విచారణతో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






