రాష్ట్రంలో మరో భయానక ఘటన.. రోడ్డు పక్కనే మహిళ దారుణ హత్య?

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 06:03:59  IST  )

మహిళ దారుణ హత్యకు గరైన ఘటన నవీపేట్ మండల పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో భయానక ఘటన.. రోడ్డు పక్కనే మహిళ దారుణ హత్య?
X

దిశ, నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో మహిళ హత్య కలకలం రేపింది. మండలంలోని శివారు బాసర ప్రధాన రహదారి పక్కన తల మొండెం వేరు చేసి, కుడిచేతి వేళ్లు నరికి వివస్త్రను చేసిన గుర్తుతెలియని మహిళ మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు నవీపేట్ ఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ, నిజామాబాద్ సీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.

పోలీసుల సమాచారం మేరకు.. గుర్తు తెలియని 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళను వేరే ప్రాంతంలో హత్యచేసి మిట్టాపూర్ శివారులో పడవేశారని, పాత కక్షలు, అక్రమ సంబంధంతోనే హత్య జరగవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ హాస్పిటల్‌కు తరలించించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, చుట్టపక్కల గ్రామాల్లో ఎవరైనా మహిళలు తప్పిపోయినట్లైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Next Story