- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. ఇద్దరు యువకుల దారుణ హత్య
పెద్ద మనుషుల పంచాయితీలో భాగంగా ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైన భయానక ఘటన పెద్దపల్లి (Peddpally) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పెద్ద మనుషుల పంచాయితీలో భాగంగా ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైన భయానక ఘటన పెద్దపల్లి (Peddpally) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ (Sultanabad) మండల పరిధిలోని సుగ్లాంపల్లి (Suglampally) గ్రామంలో ఓ దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోనే మాటమాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాలు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగాయి. ఈ ఘర్షణలో మల్లేశ్, గణేష్‌లకు కత్తిపోట్లకు గురికాగా వారిద్దరూ తీవ్ర రక్తస్త్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అమ్మాయి వర్గమే సుపారీ ముఠాను పంచాయితీకి తీసుకొచ్చారని అబ్బాయి వర్గం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దాడి అనంతరం అమ్మాయి తరఫు బంధువులు అక్కడి నుంచి పరార్ అయినట్లుగా తెలుస్తోంది.






