Delhi liquor scam లో మరో అరెస్ట్

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-30 05:43:19  IST  )

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో మద్యంవ్యాపారి అమిత్ అరోరాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది.

Delhi liquor scam లో మరో అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో మద్యంవ్యాపారి అమిత్ అరోరాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా గురుగాంకు చెందిన మద్యం వ్యాపారి అని తెలుస్తోంది. బడ్డీ రిటెయిల్ సంస్థలో డైరెక్టర్ అమిత్ అరోరా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సన్నిహితుడిగా అమిత్ అరోరాకు పేరుంది. సిసోడియా సన్నిహితులైన ముగ్గురిలో అమిత్ అరోరా ఒకరు. సిసోడియాకు అత్యంత సన్నిహితంగా అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరాలు ఉన్నారు. వీరిలో దినేశ్ అరోరా ఇప్పటికే సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారారు. ఈడీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.





Read More......

షర్మిలపై కవిత వ్యంగ్యాస్త్రాలు..

Next Story