- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంగన్‌వాడీ ఆయా దాష్టీకం.. కత్తిని కాల్చి చిన్నారికి వాతలు పెట్టిన వైనం

దిశ, వెబ్‌డెస్క్: లోకంలో మానవత్వం మంటగలిసిపోతోంది. చిన్నారులను కంటికిరెప్పలా కాపాడాల్సిన అంగన్‌వాడీ బడులు చిత్రహింసలకు వేదికగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బుడిబుడి అడుగులు వేస్తూ.. అంగన్‌వాడీ పాఠశాలకు వచ్చిన ఐదేళ్ల చిన్నారికి అంగన్‌వాడీ ఆయా వాతలు పెట్టిన ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన మణిదీప్ (5) రోజూలాగే అంగన్‌వాడీకి వెళ్లాడు. ఈ క్రమంలోనే మణిదీప్ (Manideep) అల్లరి చేస్తున్నాడని.. తీవ్ర ఆగ్రహానికిలోనైన ఆయా విచక్షణ మరిచి కూరగాయాలు కట్ చేసే కత్తిని గ్యాస్ పోయ్యిపై ఎర్రగా కాల్చి శరీరంపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు, ఆయా చేసిన నిర్వాకంపై సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంలో సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. అంతటితో ఆగకుండా వారు సీపీడీవో కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడి వచ్చిన ఆయా తరఫు బంధువులు, బాలుడి కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆయాపై చర్యలు తీసుకుంటారా.. లేక కాలయాపన చేస్తారా? వేచి చూడాల్సిందే మరి.