చికిత్స పొందుతూ గుర్తు తెలియని యువకుడు మృతి

by Ratna Kumari |

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియ‌ని యువ‌కుడు సోమ‌వారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని  యువకుడు  మృతి
X

దిశ‌, బిక్క‌నూరు : ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియ‌ని యువ‌కుడు సోమ‌వారం మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. భిక్క‌నూరు మండ‌లం జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని యువకుడి (30)ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అత‌డినీ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడి ఎడమ చేతి పై డబ్బా (dabba ) అని ఇంగ్లీషులో రాసిన పచ్చబొట్టు మాత్రమే రాసి ఉంది. ఎలాంటి వివరాలు అతని వద్ద లేవు. మృతుని ఆచూకి తెలిస్తే ఎస్సై 8712686154, సీఐ నెంబ‌ర్ 8712686153 కి స‌మాచారం ఇవ్వాల‌ని ఎస్సై వివ‌రించారు.

Next Story