రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి..!

by Ratna Kumari |

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఉండ‌వ‌ల్లి మండ‌లం అలంపూర్ చౌర‌స్తా స‌మీపంలో చోటు చేసుకుంది.

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి..!
X

దిశ‌, అలంపూర్ : రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఉండ‌వ‌ల్లి మండ‌లం అలంపూర్ చౌర‌స్తా స‌మీపంలో చోటు చేసుకుంది. గ‌ద్వాల రైల్వే పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సుమారు 40 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన వ్య‌క్తి రైల్వే ట్రాక్ పై మృతి చెందాడు. మృతుడి ఒంటినిండా ప‌చ్చ‌బొట్లు, ఛాతీ పై శివుని బొమ్మ‌, ఎడ‌మ వైపు ఫాతిమా-ర‌తి, కుడివైపు కాశ‌మ్మ‌, చేతికి ఎర్ర‌ని దారం, అమ్మ‌మ్మ‌-కాశీ కృష్ణ‌వేణి అని ప‌చ్చ‌బొట్లు ఉన్నాయి. వీపులో మెడ వ‌ర‌కు త్రిశూలం ప‌చ్చ‌బొట్టు క‌ల‌దు. ఎరుపు రంగు ష‌ర్ట్, న‌లుపు రంగు జీన్స్ ప్యాంట్ ధ‌రించాడు. ఇత‌నికి సంబంధించిన వారు ఎవ‌రైనా ఉంటే గ‌ద్వాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మృత‌దేహాన్ని భద్ర‌ప‌రిచారు. 8341252529 నెంబ‌ర్ కి సంప్ర‌దించ‌గ‌ల‌రు అని హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు.

Next Story