- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి గొంతు కోసిన గుర్తుతెలియని దుండగుడు
గుర్తు తెలియని దుండగుడు యువకుడి గొంతు కోసి పరారైన ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, బీర్కూర్ : గుర్తు తెలియని దుండగుడు యువకుడి గొంతు కోసి పరారైన ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన టేకు అంజయ్య (22) అనే యువకుడు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో నల్లజేరు చెరువు కట్ట వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని దుండగుడు అంజయ్య మెడపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. దుండగుడు ముఖానికి మాస్క్ వేసుకోవడంతో అంజయ్య అతడిని గుర్తుపట్టలేక పోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అంజయ్యను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంజయ్యకు తల్లిదండ్రులు లేరు, ఓ తమ్ముడు మాత్రమే ఉన్నాడు. అతను ఓ హోటల్ లో పని చేసేవాడు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Next Story






