కుటుంబ క‌ల‌హాల‌తో చెరువులో దూకి వృద్ధురాలు మృతి

by Ratna Kumari |

కుటుంబ క‌ల‌హాల‌తో చెరువులోకి దూకి వృద్ధురాలు మృతి చెందిన సంఘ‌ట‌న న‌ర్వ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

కుటుంబ క‌ల‌హాల‌తో చెరువులో దూకి వృద్ధురాలు మృతి
X

దిశ‌, న‌ర్వ : కుటుంబ క‌ల‌హాల‌తో చెరువులోకి దూకి వృద్ధురాలు మృతి చెందిన సంఘ‌ట‌న న‌ర్వ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప‌బ్బ‌తి ర‌మేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌ర్వ మండ‌ల ప‌రిధిలోని పాతేర్చెడ్ గ్రామానికి చెందిన రొడ్డ‌పొల్ల సాయ‌మ్మ అలియాస్ కొత్త‌ప‌ల్లి సాయ‌మ్మ‌(63) గ్రామంలో ఆంజ‌నేయ‌స్వామి ఉత్స‌వాల సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి నిద్ర చేస్తాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపింది. కుటుంబ స‌భ్యులు శ‌నివారం వ‌ద్దు.. మంగ‌ళ‌వారం వెళ్ల‌మ‌ని తెలిపారు. ఈ విష‌యంలో మ‌న‌స్థాపానికి గురైన సాయ‌మ్మ మే 02న సాయంత్రం ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లింది.

సాయ‌మ్మ ఆంజ‌నేయ‌స్వామి గుడికే వెళ్లింద‌ని భావించారు కుటుంబ స‌భ్యులు ఆదివారం ఉద‌యం గ్రామంలోని చెరువులో శ‌మై తేలింది. గుర్తు తెలియ‌ని మ‌హిళా శ‌వం తేలింద‌ని స‌మాచారం రావ‌డంతో సాయ‌మ్మ కుమారుడు రొడ్డ‌పోల్ల న‌ర‌సింహులు అక్క‌డికి వెళ్లి చూడ‌గా.. త‌న త‌ల్లి సాయ‌మ్మ మృత‌దేహంగా గుర్తించారు. గుడికి వెళ్లే విష‌యంలో గొడ‌వ జ‌ర‌గ‌డంతో మ‌న‌స్థాపానికి చెందిన సాయ‌మ్మ చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డిన‌ట్టు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ‌కు ఎవ‌రిపై అనుమానం లేద‌ని కుమారుడు ఫిర్యాదులో తెలిపారు. న‌ర‌సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై ప‌బ్బ‌తి ర‌మేష్ తెలిపారు.

Next Story