- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీ కొని వృద్ధురాలు మృతి
కారు ఢీ కొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని కూడలి వద్ద గురువారం చోటు చేసుకుంది.

దిశ, ఎల్కతుర్తి : కారు ఢీ కొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని కూడలి వద్ద గురువారం చోటు చేసుకుంది. ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఎనిమిదేళ్లుగా మతి స్థిమితం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి బస్టాండ్ లో ఉంటుంది. చుట్టూ పక్కల ఉన్న హోటల్ వాళ్లు రోజు వారిగా టిఫిన్, లంచ్ పెట్టడంతో అతి తిని బస్టాండ్ లో నివసిస్తోంది. గురువారం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ రమేష్ బాబు బస్టాండ్ లో టీ తాగి తన కారు తీసే క్రమంలో కారు ముందు కూర్చున్నది గమనించక ముందుకు నడిపాడు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు కారు కింద ఉన్న ఆమెను 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించినట్టు ఎస్సై తెలిపారు. ఈమెకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై సూచించారు. +918712685130 నెంబర్ కి సంప్రదించాలని కోరారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






