- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలో పడి వృద్ధుడు మృతి..
by Batti.Sumithra |
వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన కుశనపెల్లి రాజయ్య (75) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు.

X
దిశ, వెల్గటూర్ : వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన కుశనపెల్లి రాజయ్య (75) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాజయ్య ఈ నెల 17న గ్రామంలో జరిగిన చిరుతల రామాయణం నాటక ప్రదర్శన తిలకించాడు.
తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. ఈ విషయం ఎవరు గమనించలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. బావిలో పడిన వృద్ధుడి మృతదేహం ఆదివారం ఉదయం పైకి తేలగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కోడలు గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేష్ తెలిపారు.
Next Story






