- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అమానవీయ ఘటన.. మద్యం మత్తులో అత్తపై అత్యాచారం, హత్య
అత్యంత పవిత్రంగా భావించే మానవ సంబంధాలను మద్యం మత్తు మంటగలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత పవిత్రంగా భావించే మానవ సంబంధాలను మద్యం మత్తు మంటగలిపింది. ఆశ్రయమిచ్చి ఆదుకున్న అత్తపైనే ఓ అల్లుడు మృగంలా ప్రవర్తించాడు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రఘుపతిపేటకు చెందిన రాఘవేందర్ అనే వ్యక్తికి రేణుకతో వివాహం జరిగింది. అయితే, రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవ పడేవాడు. కూతురి కాపురం సజావుగా సాగాలన్న ఉద్దేశంతో, అత్తగారు తన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. తన ఇంట్లోనే ఉంచుకుని వారికి ఆశ్రయమిచ్చింది.
కాగా, రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో, మనస్తాపానికి గురైన భార్య రేణుక తన అక్క ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో 65 ఏళ్ల వృద్ధురాలైన అత్త మాత్రమే ఉంది. నిన్న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాఘవేందర్, కామవాంఛతో కళ్లు మూసుకుపోయి తనపై అత్త అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన రాఘవేందర్ పక్కనే ఉన్న బండరాయితో అత్తపై బలంగా మోది అతి కిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఉదయం పక్కింటి వాళ్లు లేచి చూసేసరికి మహిళ రక్తపు మడుగులో పడి ఉండగా పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు






