- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్ల్ ఫ్రెండ్ ను గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు
by Javid Pasha |
ముంబైలో దారుణం చోటు చేసుకుంది. నమ్మి తనతో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ను అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రియుడు.

X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. నమ్మి తనతో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ను అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రియుడు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని ఆటోలో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వారు సాకి నక ఏరియాలోని ఖైరానీ రోడ్డుకు చేరుకున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో కోపంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆటోలోపలే కత్తితో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆటో నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






