వావ్.. వాట్ ఏ ప్లాన్.. చోరీ డబ్బుతో డెయిలీ ఫైనాన్స్..!

by Bhanu |

తాళం కోసం వెతుకుతాడు.. దొరకకపోతే చిన్న రాడ్ తో తాళంను విరగొట్టేస్తాడు. ఇది అల్లం శివ చోరీ స్టైల్. జైలు నుంచి విడుదలైన 7 నెలలో 7 దొంగతనాలకు పాల్పడి మరో సారి మోస్ట్ వాంటెడ్ అయ్యాడు.

వావ్.. వాట్ ఏ ప్లాన్..  చోరీ డబ్బుతో డెయిలీ ఫైనాన్స్..!
X

దిశ, సిటీ క్రైం : తాళం కోసం వెతుకుతాడు.. దొరకకపోతే చిన్న రాడ్ తో తాళంను విరగొట్టేస్తాడు. ఇది అల్లం శివ చోరీ స్టైల్. జైలు నుంచి విడుదలైన 7 నెలలో 7 దొంగతనాలకు పాల్పడి మరో సారి మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దాదాపు 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహాబూబ్ నగర్ గాజుల పేట ప్రాంతానికి చెందిన అల్లం శివ కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్ అంబర్ పేట్ బతుకమ్మకుంట రామక్రిష్ణ హాట్స్ కు వలస వచ్చి నివాసం ఉంటున్నాడు.


బెట్టింగ్ లు, మద్యం, సిగరేట్ లకు అలవాటు పడి విలాసవంతంగా జీవిస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో చోరీలకు శ్రీకారం చుట్టాడు. 2023 సంవత్సరంలో మొత్తం 9 చోరీలకు పాల్పడ్డాడు. ఆ డబ్బుతో విలాసాలతో పాటు డెయిలీ ఫైనాన్స్ ను చేస్తున్నాడు. ఈ 9 కేసులలో అరెస్టై జైలుకు వెళ్ళి గత ఏడాది అక్టోబరు నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. ఇలా జైలు నుంచి వచ్చిన అల్లం శివ మరో 7 చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ని హర్షగూడ గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆధారాలు సేకరించి అల్లం శివను గురువారం అరెస్టు చేశారు.


అతని నుంచి 20 లక్షలు విలువ చేసే 13 తులాల బంగారం , 41 తులాల వెండి ఆభరణాలు, 50 వేల నగదు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అల్లం శివ చోరీకి స్పాట్ పెడితే ముందుగా రెక్కీ చేసి ఆ తర్వాత చోరీలు చేస్తుంటాడని పోలీసుల విచారనలో తెలిసింది. హర్షగూడలో కూడా చోరీకి ఇంటి యజమానులు తాళం వేసి దానిని ఇంటి బయట ఉన్న పిల్లర్ పై పెట్టి వెళ్ళడం అలవాటు. అల్లం శివ రెక్కీలో భాగంగా ముందుగా తాళం కోసం వెదుకుతాడు, ఆ తర్వాత దొరకకసోతే తాళం ను విరగొట్టి చోరీ చేసి అందినకాడికి దోచుకుని వెళ్ళడం అతని నేరప్రక్రీయగా పోలీసులు గుర్తించారు. అల్లం శివ చోరీకి కేటీఎమ్ , రాయల్ ఇన్ ఫీల్డ్ బైక్ లను ఉపయోగిస్తాడని తెలిసింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆ రెండు బైక్ లను కూడా రికవరీ చేశారు. బుల్లెట్ అతని స్నేహితుడి పేరు మీద ఉండగా, కేటీఎం బైక్ అతని భార్య పేరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లం శివ అరెస్టు తో మొత్తం 7 చోరీ కేసుల మిస్టరీ వీడిపోయింది.

Next Story