- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వాంకిడి : మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన మస్నే రావుజీ (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ పోషెట్టి తెలిపిన వివరాల ప్రకారం ఖమానకు చెందిన రావుజీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై పనిచేయడం మానేశాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు.
- Tags
- suicide
Next Story






