- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికుడిపై దాడి కేసు.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టెర్మినల్-1 వద్ద ఒక ప్రయాణికుడిపై భౌతిక దాడి జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టెర్మినల్-1 వద్ద ఒక ప్రయాణికుడిపై భౌతిక దాడి (Physical attack on a passenger) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ఆరోపణలపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ వీరేందర్ సెజ్వాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అంకిత్ దేవాన్ (victim is Ankit Devan) తన రక్తంతో కూడిన ముఖం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితుడి ముక్కు ఎముక విరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో పోలీసులు సీరియస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సెక్యూరిటీ చెక్ వద్ద క్యూ లైన్ పాటించే విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఈ దాడికి దారితీసింది. తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న అంకిత్, సిబ్బంది క్యూ లైన్ దాటి వెళ్తుండటాన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పైలట్ సెజ్వాల్ (అప్పుడు ఆయన డ్యూటీలో లేరు) ఆగ్రహంతో ఊగిపోయి అంకిత్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి, అంతర్గత విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.






