TG: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ ఇస్లావత్ వినోద్

by Gantepaka Srikanth |

అక్రమ సంపాదనకు ఆశపడి మరో అధికారి చిక్కుల్లో పడ్డారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏఈ ఇస్లావత్ వినోద్(AE Islawat Vinod) ఏసీబీ అధికారులకు చిక్కాడు.

TG: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ ఇస్లావత్ వినోద్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంపాదనకు ఆశపడి మరో అధికారి చిక్కుల్లో పడ్డారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏఈ ఇస్లావత్ వినోద్(AE Islawat Vinod) ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మిషన్ భగీరథ ఇంట్రా విభాగంలో వినోద్ ఏఈగా పనిచేస్తున్నారు. ఇటీవల బదిలీపై సూర్యాపేట(Suryapet)కు వచ్చారు. ఎంబీ బుక్ రికార్డ్, రూ.20 లక్షల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేశారు. తన అన్న కుమారుడు మూర్తితో కలిసి వినోద్ లంచం తీసుకున్నారు. ఇంతలో ఏసీబీ(ACB) అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి వినోద్ పరుగులు తీశారు. స్థానిక పోలీసుల సాయంతో వినోద్‌ను ఏసీబీ అధికారులు కోదాడ వద్ద పట్టుకున్నారు. ఆయన అన్న కుమారుడు మూర్తి మాత్రం తప్పించుకున్నారు. ప్రస్తుతం మూర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వినోద్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story