ED విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్

by Gantepaka Srikanth |

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting App Case)లో నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) నేడు ఈడీ(Enforcement Directorate) ముందు హాజరుకానున్నారు.

ED విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting App Case)లో నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) నేడు ఈడీ(Enforcement Directorate) ముందు హాజరుకానున్నారు. పది రోజుల క్రితం ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చి, ఈరోజు హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొందరు సెలబ్రెటీలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిలో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మిలు ఉన్నారు. దగ్గుబాటి రానా ఈ నెల 23, ప్రకాశ్‌రాజ్‌ ఈ నెల 30, విజయ్‌దేవరకొండ ఆగస్టు 6, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు, యూట్యూబర్లకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు.

Next Story