- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accused Arrested: పరువు హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు (Eligedu) మండల పరిధిలోని ముప్పిరితోట (Muppiri Thota) గ్రామంలో తన కూతురిని ప్రేమించాడని.. ఓ యువకుడిని, యువతి తండ్రి వేటాడి.. వెంటాడి గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు (Eligedu) మండల పరిధిలోని ముప్పిరితోట (Muppiri Thota) గ్రామంలో తన కూతురిని ప్రేమించాడని.. ఓ యువకుడిని, యువతి తండ్రి వేటాడి.. వెంటాడి గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ దాడిలో ఆ యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న డీఎస్పీ, సిబ్బంది అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం నిందితుడిని ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు యువతి తండ్రి సదయ్యను పోలీసులు చీమలపేట (Cheemalapeta) వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే, యువకుడిపై అతడు ఒక్కడే దాడికి చేశాడా.. లేక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు నిందితుడు సదయ్యను విచారిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
కాగా, ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (Sai Kumar) (17) అదే గ్రామానికి చెందిన ఓ యువతికి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే, విషయం కాస్త తండ్రి సదయ్యకు తెలియడంతో.. సాయి కుమార్‌తో మాట్లాడొద్దంటూ తన కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి మాటను పట్టించుకోని ఇద్దరు నిత్యం ఫోన్‌లో, బయట కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సదయ్య, సాయికుమార్‌ను అంతమొందించాలని అనుకున్నాడు. గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సాయికుమార్ తన జన్మదిన వేడుకులను జరుపుకుంటుండగా.. అక్కడి వెళ్లిన సదయ్య, గొడ్డలితో సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయలైన అతడిని తోటి స్నేహితులు సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయి కుమార్ ప్రాణాలు విడిచాడు.






