ముందు ప్రాదేయపడి, తరవాత కత్తితో బెదిరించి.. ఆ దారుణానికి పాల్పడింది వీడే!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-17 03:29:52  IST  )

రెండు రోజుల క్రితం గుంటూరులో రైలు ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన జొన్నగడ్డ రాజారావుగా గుర్తించారు.

ముందు ప్రాదేయపడి, తరవాత కత్తితో బెదిరించి.. ఆ దారుణానికి పాల్పడింది వీడే!
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం గుంటూరులో రైలు ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన జొన్నగడ్డ రాజారావుగా గుర్తించారు. అంతే కాకుండా రెండు నెలల క్రితం కేరళకు చెందిన మహిళపై సైతం అతడు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఇదిలా ఉంటే సంత్ర‌గ‌చి ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీ మ‌హిళ‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. గుంటూరు స్టేష‌న్ కు చేరుకున్న త‌ర‌వాత సంత్ర‌గ‌చి ఎక్స్ ప్రెస్ రైలులో మ‌హిళా బోగీలో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై రాజారావు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మ‌హిళ‌ల బోగీ అని చెబుతున్నా విన‌కుండా ప్రాధేయ‌ప‌డి రైలు ఎక్కి త‌ర‌వాత మ‌హిళ‌ను బెదిరించి ఆమె వ‌ద్ద ఉన్న న‌గ‌దు దోచుకున్నాడు. క‌త్తితో బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్ప‌డి రైలు దిగి పారిపోయాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రిపి రెండు రోజుల్లో పట్టుకున్నారు.

Next Story