- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్టడీలో ఉన్న నిందితుడి పరారీ
కస్టడీలో నిందితుడు పరారు కాగా, పోలీసులు ఆ నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్న ఘటన చేర్యాల పోలీస్ స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది.

గంటల వ్యవధిలో పట్టుకున్న చేర్యాల పోలీసులు
దిశ, చేర్యాల : కస్టడీలో నిందితుడు పరారు కాగా, పోలీసులు ఆ నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్న ఘటన చేర్యాల పోలీస్ స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. శుక్రవారం చేర్యాల పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇరువురిని కస్టడీలోకి తీసకున్న అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టడీలోని వ్యక్తి శనివారం తెల్లవారుజామున చేర్యాల పోలీస్ స్టేషన్ నుంచి పరారైయ్యాడు.
యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని అతడితో పాటు మరో నిందితుడైన నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కాగా, శుక్రవారం గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితులను పట్టుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసు చేర్యాల పోలీసులకు ఓ సవాలుగా మారింది.






