- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొర్రేడు వాగులో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని మొర్రేడు వాగులో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృతి చెందాడు.

దిశ, లక్ష్మీదేవిపల్లి : మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని మొర్రేడు వాగులో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి చాతకొండ గ్రామపంచాయతీ పరిధిలో వాగు నుంచి ఎడ్లబండి ద్వారా ఇసుక తరలిస్తున్న సమయంలో బండి నీటిలో ఇరుక్కుపోయిందని తెలిపారు. ఎడ్ల బండిని గట్టుపైకి లాగిన తరువాత ఈ క్రమంలో బండిపై ఉన్న వ్యక్తి బట్టలు నీటిలో పడిపోవడంతో వాటిని తీసుకునేందుకు వాగులోకి దిగినట్లు తెలిపారు. అయితే అనుకోని పరిస్థితుల్లో నీటిలో ఇబ్బందికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడని అన్నారు. పక్కనే ఉన్న స్థానికులు గమనించి అతడిని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడిని సాటివారిగూడెం గ్రామానికి చెందిన ఈసాల వెంకటేశ్వర్లు (39) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న లక్ష్మీదేవిపల్లి మండల పోలీసులు ఘటనాస్థలనికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టనికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.






