- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Accident : బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా పరలోకాలకు
దిశ,అల్లాదుర్గం : బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని ఒకరు మృతి (One died)చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రమైన అల్లాదుర్గం గ్రామ శివారులోని 161వ జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గౌరారం గ్రామానికి చెందిన కోరుబోయిన అంజయ్య , సవిత భార్యాభర్తలు. వీరు హైదరాబాద్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు.
వీరు తన కుమారుడు చరణ్ తో కలిసి ఒకే బైక్పై బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ లారీని ఢీకొనడంతో ముగ్గురూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సవిత (Savita)అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న అంజయ్య, చరణ్ లను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి మామ భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.