ఝార్ఖండ్ బొగ్గు గనిలో ప్రమాదం.. ఏకంగా నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL)కు చెందిన వాడకంలో లేని ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ గోడ కూలి నలుగురు దుర్మరణం పాలైన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది.

ఝార్ఖండ్ బొగ్గు గనిలో ప్రమాదం.. ఏకంగా నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL)కు చెందిన వాడకంలో లేని ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ గోడ కూలి నలుగురు దుర్మరణం పాలైన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుజు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగియా గ్రామంలోని మహువా తుంగరి సమీపంలో ఉన్న CCLకు చెందిన కర్మ కోల్ మైన్ నుంచి అక్రమంగా స్థానికులు 12 మంది కలిసి బొగ్గును తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే వారిపై ఓ పెద్ద దిబ్బ కూలింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొదట ఒక్క మృతదేహమే లభ్యం కాగా.. సాయంత్రానికి మరో మూడు డెడ్‌బాడీలు లభ్యమైనట్లుగా రామ్‌గఢ్ డిప్యూటీ కమిషనర్ ఫియాజ్ అక్ అహ్మద్ ముంతాజ్ పేర్కొన్నారు. పోలీసులతో పాటు సీసీఎల్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సబ్‌ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పరమేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మొత్తం నాలుగు మృతదేహాలను గ్రామస్తులకు అప్పగించామని అన్నారు. మరణించిన వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

Next Story