- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో బొప్పాయి కాయలతో వెళ్తున్న మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. అందులో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి..
పల్నాడు రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. యాక్సిడెంట్‌లో ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. అనంతరం ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






