- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన ఖమ్మం జిల్లా (Khammam District)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/సత్తుపల్లి: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) పెనెబల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వైజాగ్ నుంచి 20 మంది ప్రయాణికులతో ఖమ్మం వైపు వస్తుంది. ఈ క్రమంలోనే బస్సు లంకపల్లి గ్రామ శివారులోకి రాగానే రొడ్డు వెంట ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సీటు వెనుక కూర్చున్న కండక్టర్ సీతారామ ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలు కాగా సమీప ఆసుపత్రికి తరలించారు. సీతారామప్రసాద్ సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సత్తుపల్లి బస్టాండ్‌లో ఖమ్మం వెళ్తున్న బస్సు ఎక్కి డ్రైవర్ సీట్ వెనక కూర్చున్నాడు. ఆయిల్ ట్యాంకర్‌ను బస్ వేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో సీతారామ ప్రసాద్ గాయపడి మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఇద్దరిని సత్తుపల్లి ఆసుపత్రికి, మరో ముగ్గురిని పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంపై పెనుబల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.






