Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల పరిధిలోని మూలపాడు (Mulapadu) శివారులో.. ఎదురుగా వస్తున్న ఆటోను బొలెరో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ (Vijayawada)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) కోసం ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Next Story