- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసులు దుర్మరణం
ఒడిశాలోని ఝార్సుగూడ జాతీయ రహదారి 49పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన హృదయ విదారక విషాద ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రంలోని ఝార్సుగూడ (Jharsuguda) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారి 49 (NH-44)పై, ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ (SUV) వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఝార్సుగూడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర ప్రమాదాన్ని ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.






