Accident: ఆంధ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసి దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలంగాణ (Telangana) వాసి దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని తిరుపతి (Tirupati) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Accident: ఆంధ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలంగాణ (Telangana) వాసి దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని తిరుపతి (Tirupati) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ (Abdullapurmet) మండల పరిధిలోని బండరావిరాల (Bandaraviraala) గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy), మల్లారెడ్డి భరత్, బాలిరెడ్డి, శ్రీనివాసులు కలిసి కారులో తిరుపతి (Tirupati) వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు తిరుపతి-నాయుడుపేట హైవేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story