- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు సజీవ దహనం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు సజీవ దహనమైన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు సజీవ దహనమైన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాంకేర్ (Conquer) జిల్లా కేంద్ర సమీపంలో నలుగురు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బ్రిడ్జి వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న నలుగురు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గమనించిన తోటి వాహనదారులు కాంకేర్ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బందితో చేరుకుని కారులో మంటలను ఆర్పివేశారు. అనంతరం గాయపడని ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
Next Story






