- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: లోయలో పడిపోయిన బస్సు.. స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం
by Kema Shiva Kumar |
ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడి స్పాట్‌లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడి స్పాట్‌లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్కాఘాట్ సబ్-డివిజన్ పరిధిలోని మసేరన్ ప్రాంతంలో.. సరిగ్గా మండి పట్టాణానికి 60 కి.మీటర్ల దూరంలో ప్రయాణికులతో అతివేగంతో వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మండి ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు.
Next Story






