- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం
కర్ణాటక (Karnataka) రాష్ట్రం కోలార్ (Kolaar) జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రం కోలార్ (Kolaar) జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య (Annamayya) జిల్లా రామసముద్రం మండలం పూలకుంటవారిపల్లె (Poolakuntavaripalle)కు చెందిన కూలీలు పనుల నిమిత్తం జీపులో కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. శ్రీనివాసపురం వద్దకు చేరుకోగానే జీపు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో శ్రీనివాసులు (25), వెంకటమ్మ (60), మునెప్ప (65) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పూలకుంటవారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో సుమారు 20 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం. గాయపడిన 15 మందిని వెంటనే స్థానికులు, పోలీసులు సమీపంలోని రాయల్పాడు, మదనపల్లె ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






